E.G: రాజమండ్రిలో జరిగే 2027 గోదావరి పుష్కరాలకు వచ్చే బ్రాహ్మణ పుష్కర యాత్రికులకు వివిధ సేవలు అందించేందుకు నూతన కమిటీని ఎన్నుకున్నట్లు పరిశీలకులు డాక్టర్ పొన్నా సుబ్రహ్మణ్య శర్మ సిద్ధాంతి సోమవారం తెలిపారు. ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిందన్నారు. అధ్యక్షుడిగా దుర్వాసన సత్యనారాయణ ఎన్నికైనట్లు వెల్లడించారు.