AP: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరుగుతోందని మంత్రి గొట్టిపాటి అన్నారు. అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ‘200కు పైగా 33/11 కేవీ సబ్స్టేషన్ల డిమాండ్ ఉంది. వాటి ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. విశాఖలో భూగర్భ కేబుల్‌పై ప్రతిపాదన పరిశీలిస్తున్నాం. పరిశ్రమలు, వ్యవసాయం కనెక్షన్లు పెరుగుతున్నాయి’ అని వెల్లడించారు.