HYD: నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టుషాపులపై పహాడీషరీఫ్ పోలీసులు కొరడా ఝుళిపించారు. గుట్టుచప్పుడు కాకుండా మద్యం విక్రయిస్తున్న స్థావరంపై దాడులు చేసి భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 17 వేల విలువైన 88 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు శివకుమార్‌ను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసుకున్నారు.