TG: హైదరాబాద్ నాగోల్లో ఇవాళ BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర కీలక నేతలు పర్యటించనున్నారు. గత BRS ప్రభుత్వ హయాంలో మూసీ నది పునరుజ్జీవం, అభివృద్ధి కోసం చేపట్టిన పనులను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. మూసీ ప్రక్షాళనపై గతంలో తాము చేసిన కృషిని వివరిస్తూనే, ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది.