PDPL: వార్డు అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి ఆదేశించారు. రామగుండం కార్పొరేషన్లో బుధవారం వార్డు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు అధికారులు వారధిగా పని చేయాలన్నారు. శానిటేషన్ నిర్వహణ, ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. 100% ఆస్తి పన్నువసూలు చేయాలని ఆదేశించారు.