కోనసీమ: అమలాపురం పట్టణంలోని కొంకాపల్లి అబ్బిరెడ్డి వారి వీధి లో బుధవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక పాక పూర్తిగా దగ్ధమైంది. గుబ్బల సత్యవతి అనే మహిళ నిర్వహిస్తున్న తాటాకు పాక హోటల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి దగ్దం అయినట్లు స్థానికులు అంటున్నారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేశారు.