KDP: రౌడీ షీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులకు జిల్లా వ్యాప్తంగా పోలీసుల కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు నేరాలకు దూరంగా ఉండాలని, సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. భవిష్యత్తులో చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఇటువంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.