SKLM: టెక్కలి మండలం తలగాం సమీపంలో బుధవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ విద్యార్థిని టెక్కలి-నౌపడ వైపు వెళ్తున్న రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.