NLR: సంగం జడ్పీ ఉన్నత పాఠశాలలో జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థినులకు బుధవారం ఆత్మరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై రాజేష్, హెడ్మాస్టర్ బుజ్జయ్య, పీడీ రమణయ్య పాల్గొన్నారు. ఆపద సమయంలో ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో విద్యార్థినులకు సూచనలు చేశారు. అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.