మేడ్చల్: చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబరేటరీస్ డ్రగ్స్ వ్యవహారం తమ పరిధిలోకి రాదని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ (DCA) అధికారులు స్పష్టంచేశారు. వాగ్దేవి ల్యాబ్స్ ఒక కెమికల్ ఫ్యాక్టరీ అని, దానికి ఎలాంటి డ్రగ్ లైసెన్స్ లేదని తెలిపారు. వారు తయారుచేసిన ‘మెఫిడ్రోన్’ అనే పదార్థం అసలు ఔషధమే కాదన్నారు. ఈ కేసు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, DRA పరిధిలో ఉంటుందన్నారు.