కృష్ణా: కృష్ణా జిల్లాలో యూరియా సరఫరా నిరంతరాయంగా సాగుతోందని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 1 నుంచి నేటి వరకు జిల్లాకు 3,180 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందన్నారు. ఈరోజు రాత్రిలోపు 1300 టన్నులు రానుందని, 2 రోజుల్లో మరో 1300 టన్నులు రానుందని పేర్కొన్నారు.