MHBD: కేసముద్రం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా యూరియా కేంద్రాల పరిస్థితిని ఆయన పర్యవేక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. యూరియా పంపిణీలో రైతులకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.