ADB: గత మూడు సంవత్సరాలుగా అరకొర నిధులు విడుదల చేయడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్ పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్ అసిస్టెంట్ కలెక్టర్ సలోని చబ్రాకు వినతిపత్రం సమర్పించారు. బెస్ట్ అవైలబుల్ పాఠశాలల పెండింగ్ ఫీజు బకాయిలను విడుదల చేయాలని ఆయన కోరారు.