ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి స్వామి సోమవారం CMRF చెక్కులను పంపిణీ చేశారు. పలు గ్రామాలకు చెందిన లబ్దిదారులకు సోమవారం చెక్కులను అందించారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్యంపట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు.