CTR: పెద్దపంజాణి మండలంలోని రాజు పల్లిలో యూరియా పంపిణీని పుంగనూరు ఏడీఏ శివకుమార్ సోమవారం తనిఖీ చేశారు. ఈ మేరకు పుంగనూరు వ్యవసాయ శాఖ డివిజన్ పరిధిలో రైతులకు యూరియాను రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. అనంతరం రైతులకు అవసరమైన మేర సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.