జేసీ ప్రభాకర్ రెడ్డి నిత్యం వార్తలో ఉంటారు. ఈసారి డ్యాన్స్ చేసి వార్తల్లోకి వచ్చారు. తాడిపత్రి నియోజకవర్గంలోకి టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేరగా.. వెల్ కం చెప్పి స్టెప్పులు వేశారు.
JC Prabhakar Reddy Dance at Lokesh Yuvagalam Padayatra
JC Prabhakar Reddy:జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy).. టీడీపీ ముఖ్య నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్.. ఈయన ఎప్పుడూ వార్తలో ఉంటారు. తాడిపత్రి నియోజకవర్గంలోకి టీడీపీ యువనేత నారా లోకేశ్ (nara lokesh) యువగళం పాదయాత్ర చేరుకుంది. తన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి (ashmith reddy), తన సోదరుడు జేసీ దివాకర్ రెడ్డితో (jc diwakar reddy) 0కలిసి లోకేశ్‌కు (lokesh) స్వాగతం పలికారు.
తాడిపత్రిలో పార్టీ కార్యకర్తలు ఊపు మీద ఉన్నారు. లోకేశ్‌కు (lokesh) గ్రాండ్ వెల్ కం చెప్పారు. టీడీపీకి సంబంధించిన పాట ప్లే కాగా.. జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) చిందులు వేశారు. కార్యకర్తలను ఉత్సాహ పరుస్తూ డ్యాన్స్ చేశారు. తన వయస్సు మరచి మరీ కాలు కదిపారు. వెంటనే ఆ వీడియో బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది.తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై (ketireddy pedda reddy) ప్రభాకర్ రెడ్డి విమర్శలు చేశారు. ఆయనొక బపూన్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు.
మరోవైపు నారా లోకేశ్‌ను (lokesh) డీఎస్పీ చైతన్య (chaitanya) కలిశారు. ఇదీ ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతం అని.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని నోటీసులు ఇచ్చారు. 149 సీఆర్పీసీ కింద నోటీసులు అందజేశామని.. శాంతి భద్రతలకు విఘాతం కల్పించొద్దు అని డీఎస్పీ తెలిపారు.