అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆదివారం తెలిపారు. మండల, డివిజన్ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలపై అర్జీలను కలెక్టరేట్లో సమర్పించవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.