E.G: రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు సెంటర్ వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. కడియం మండలం దుళ్ళ గ్రామం నుంచి వేగంగా వస్తున్న లారీ ఒక ఆటోను తప్పించబోయి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.