NZB: వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలోని KCR రెండు పడక గదుల కాలనీ ప్రజలు తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆదివారం రాత్రి MLA వేముల ప్రశాంత్ రెడ్డి కలిసి విన్నవించారు. చాలా కాలంగా మిషన్ భగీరత నీళ్లు రావటం లేదని, వచ్చిన 10 నిమిషాలు కూడా సరిగ్గా రాక నీళ్లు ఎవరికీ సరిపోవటం లేదని, దూరం నుంచి నీళ్లు మోసుకు రావాల్సిన పరిస్థితి ఉందని ఎమ్మెల్యే వద్ద తమ గోడు వెళ్ల బోసుకునన్నారు.