ATP: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో శుక్రవారం పది మంది విద్యార్థులు డిబార్ అయ్యారు. హిందూపురం బాలయేసు కళాశాలలో ఒకరు, బాలాజీ విద్యామందిర్‌లో ముగ్గురు, కళ్యాణదుర్గం జ్యోతిర్మయి కళాశాలలో ఐదుగురు, అనంతపురం చైతన్య కళాశాలలో ఒకరిపై చర్యలు తీసుకున్నట్లు పరీక్షల విభాగం డైరెక్టర్ ఆచార్య రమణ తెలిపారు.