NZB: బాల్కొండ నియోజకవర్గ వేల్పూర్ మండల కేంద్రంలో ఆదివారం ప్రజా పాలనలో భాగంగా కొత్తగా రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పన్నాల మల్లేష్, మాజీ మండల అధ్యక్షులు బద్దం హరికిషన్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉన్నారు.