TPT: వెంకటగిరి పోలేరమ్మ జాతర అంగరంగ వైభవంగా మొదలైంది. ఇందులో భాగంగా దున్నపోతుకు పూజలు నిర్వహించారు. మరోవైపు జీనిగిల వీధిలోని చాకలి మండపం వద్ద ఘటం కుండలు ఏర్పాటు చేశారు. మరికాసేపట్లో దున్నపోతుతో కలిపి ఈ ఘటాలను (కుండలు) నగరిలోని వంటింట్లోకి తీసుకెళ్తారు. పోలేరమ్మ తమ ఇంటికి వచ్చిందని భావించి రాజాగార్లు పూజలు చేస్తారు. తర్వాత ఘటం పట్టణంలో తిరుగుతుంది.