VSP: మద్యం సేవించి కారులో కూర్చున్న ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన విశాఖలోని మర్రిపాలెంలో శనివారం చోటుచేసుకుంది. మృతుడిని హిందుస్తాన్ షిప్‌యార్డులో పనిచేస్తున్న సుఖదేవ్ స్వయిన్ (50)గా పోలీసులు గుర్తించారు. సుఖదేవ్ మర్రిపాలెంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌కు రోజూ వస్తుంటాడని స్థానికులు తెలిపారు.