WCలో పాకిస్తాన్ వైఫల్యంపై దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాక్ జట్టు కొలంబోలోనే ఉంటూ అక్కడి పిచ్‌లపై పట్టు సాధించినప్పటికీ సెమీస్‌కు చేరుకోకపోవడం ఆశ్చర్యకరమని అన్నాడు. గత ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఒకే గ్రౌండ్లో ఆడటం వల్ల అద్భుతంగా రాణించిందని కొందరు చేసిన విమర్శలను గుర్తు చేశాడు. అదే సూత్రం ప్రకారం పాక్ కూడా ఈ టోర్నీలో రాణించాల్సిందని విమర్శించాడు.