KMM: ఏదులాపురం 12వ వార్డు కౌన్సిలర్ మొర్రిమేకల సత్యనారాయణ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎంపీ కార్యాలయంలో ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన సత్యనారాయణను ఎంపీ అభినందించారు. వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని సూచించారు.