WGL: హైదరాబాద్ నుంచి కోల్కతా వెళ్తున్న రైలులో ప్రయాణిస్తున్న పింకీ సహా అనే మహిళ అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆమె పరిస్థితి విషమంగా మారింది. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది కాజీపేట రైల్వే స్టేషన్కు వెంటనే చేరుకుని ఈఏంటి చైతన్య, పైలట్ కుమారస్వామి తక్షణమే స్పందించి ఆమెకు అత్యవసర చికిత్స అందించారు.