NLG: పూర్తి నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే పనులు ప్రారంభించాలని 565 జాతీయ రహదారి బైపాస్ నిర్వాసితుల పోరాట కమిటీ గౌరవాధ్యక్షులు సయ్యద్ హశం, మాజీ కౌన్సిలర్ ఎండీ సలీం, ఉట్కూరు వెంకట్ రెడ్డిలు శనివారం డిమాండ్ చేశారు. నల్గొండ పట్టణ శివారు గిరికబావి గూడెంలో పంట పొలాలను ధ్వంసం చేస్తూ పనులు కొనసాగించడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.