KMR: హన్మజీ పెట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని బోర్లం గ్రామంలోనీ TGSWRS J.R గర్ల్స్ హాస్టల్లో నేడు విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించినట్లు డా. ఇమ్రాన్ పేర్కొన్నారు. కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు.