తిరుపతి జిల్లాలోని కోరమీను గుంటలో ఆరు నెలల చిన్నారి అదృశ్యమైంది. శనివారం తెల్లవారుజామున 5.30 గంటలకు తండ్రితో పాటు నిద్రిస్తున్న పాప కనిపించకపోవడం గమనించారు. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అలిపిరి పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, సీసీ కెమెరా ఫుటేజ్‌లు పరిశీలిస్తూ విచారణ చేపట్టారు.