WGL: ఖానాపురం మండలం పాకాల చెరువు ఔషధ మొక్కలకు పేరుగాంచింది. ఈ మొక్కల గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన ఔషధ వనం, అధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యంతో కలుపుమొక్కలు, గడ్డితో నిండిపోయింది. మొక్కల కోసం ఏర్పాటు చేసిన నీటితొట్టిలు, సందర్శకులు కూర్చొని సేదతీరడానికి ఏర్పాటు చేసిన మండపం కూడా పిచ్చి మొక్కలతో దర్శనమిస్తోంది.