AKP: గొలుగొండ అంబేద్కర్ గురుకుల బాలుర వసతి గృహంలో వైద్యాధికారి డా. శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని డాక్టర్ విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.