TG: బాలాపూర్ లడ్డూ గతేడాది కన్నా రూ.4.99 లక్షల ఎక్కువ ధర పలికింది. గత సంవత్సరం రూ. 30.01లక్షలకు దక్కించుకోగా.. ఈసారి రూ.35 లక్షలు పలికింది. లడ్డూ తీసుకున్న లింగాల దశరథ్ గౌడ్.. డబ్బు చెల్లించి లడ్డూ సొంతం చేసుకున్నారు. ఆయనను కమిటీ సభ్యులు సన్మానించారు. కాగా, ఈ డబ్బులని బాలాపూర్ గణేశ్‌తో పాటు గ్రామాభివృద్ధికి ఉపయోగిస్తారు.