పెద్ది సినిమాలో రామ్ చరణ్లో కొత్త కోణాన్ని చూస్తారని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు అన్నారు. ఈ సినిమా చిత్రీకరణ చాలా బాగా సాగుతోందన్నారు. రామ్ చరణ్ తన నటన, శైలి, డిక్షన్లో కొత్తదనం చూపిస్తున్నారని.. సినిమా కోసం పూర్తిగా రూపాంతరం చెందారని తెలిపారు. ‘రంగస్థలం’ లాగానే పెద్ది కూడా చాలా ప్రత్యేకమని అన్నారు. సినిమా స్క్రిప్ట్ బలంగా ఉందని రత్నవేలు తెలిపారు.