ASR: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) పరీక్ష కోసం ఈనెల 30లోగా ధరఖాస్తు చేసుకోవాలని డీఈవో పీ.బ్రహ్మాజీరావు శనివారం తెలిపారు. డిశంబరు 7వ తేదీన పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు www.cse.ap.gov.in వెబ్సైట్ లేదా పాడేరు డీఈవో కార్యాలయంలో సంప్రదించాలన్నారు.