సికింద్రాబాద్- తిరుపతి మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్(Vande Bharat Express)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM MODI) ప్రారంభించారు. ఇది తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే రెండో వందేభారత్ ట్రైన్. ఇప్పటికే విశాఖ- సికింద్రాబాద్ మధ్య వందేభారత్ నడుస్తోంది.

సికింద్రాబాద్, తిరుపతి(Tirupati) మధ్య 661 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఈ దూరాన్ని వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఎనిమిదిన్నర గంటల్లోనే చేరుకుకుంటుంది.
ప్రయాణికులు ఈ ట్రైన్ ఎక్కేందుకు స్లైడింగ్ ఫుట్‌స్టెప్‌లను, ఆటోమెటిక్ ప్లగ్ డోర్లను(Automatic plug door) అమర్చారు. కోచ్‌ల మధ్య టచ్‌ఫ్రీ స్లైడింగ్ డోర్లను అమర్చారు. దివ్యాంగుల కోసం ప్రకత్యేకంగా డిజైన్ చేసిన వాష్‌రూంలు సికింద్రాబాద్, తిరుపతి వందేభారత్ ట్రైన్లో ఉన్నాయి.
విశాఖ- సికింద్రాబాద్ (Secunderabad) మధ్య నడిచే వందే భారత్‌కు ఆదివారం సెలవు అయితే… తిరుపతి- సికింద్రాబాద్ మధ్య నడిచే ట్రైన్‌కు మంగళవారం సెలవు దినంగా ప్రకటించారు.
టికెట్ రేట్లు పరిశీలిస్తే… సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఏసీ చైర్‌కార్(AC chair car) కు 1680 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర 3080 రూపాయలు. తిరుపతి నుంచి సికింద్రబాద్ వచ్చే ట్రైన్లో ఏసీ చైర్‌కార్ ఖరీదు 1625 రూపాయలు ఉంటే ఎగ్జిక్యూటివ్ క్లాస్ కు 3030 రూపాయలు వసూలు చేయనున్నారు.
ఇందులో బేస్‌ప్రైస్ 1168 ఉంటే… రిజర్వేషన్ ఛార్జి 40రపాయలు ఉంది. సూపర్ ఫాస్ట్ ఛార్జి (Super fast charge) 45 రూపాయలు, ఈ టికెట్‌పై జీఎస్టీ63రూపాయలు ట్రైన్లో ఫుడ్ కావాలంటే మాత్రం 364 రూపాయలు ఛార్జ్ చేస్తారు.