కోనసీమ: మామిడికుదురు మండలం అప్పనపల్లి బాల బాలాజీ దేవస్ధానంలో ఈనెల 7వ తేదీన చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం 1 గంటకు దేవాలయం మూసి వేస్తున్నట్లు కార్యనిర్వహణాధికారి వి. సత్యనారాయణ తెలిపారు. సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం సోమవారం ఉదయం 10 గంటలకు స్వామివారి సర్వదర్శనాలకు అనుమతిస్తామని అన్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు.