HYD: వ్యక్తిగత కారణాలతో ఒక బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్నగర్ జిల్లా బెల్లంపల్లికి చెందిన చీర సాయిప్రకాశ్(22) ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. సికింద్రాబాద్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ పండరి తెలిపారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.