NLR: రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు బుధవారం చేపట్టారు. మొత్తం 84 రోజులకు గాను దాదాపుగా రూ.1,13,12,632 లు నగదు వచ్చినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ జనార్దన్ రెడ్డి, ఆలయ ఈవో శ్రీనివాసుల రెడ్డి పాల్గొన్నారు.