వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆమోదించిన కొత్త పన్ను రేట్లను నవరాత్రి నాటికి అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయంతో నిత్యావసరాలు, చిన్న కార్లు, హోటల్ సేవలు వంటివి చౌకగా మారనున్నాయి. అదే సమయంలో విలాసవంతమైన వస్తువుల ధరలు పెరగనున్నాయి. దసరా, దీపావళి పండగల ముందే ఈ కొత్త ధరల అమల్లోకి రావడం సామాన్యులకు పెద్ద ఊరటనిస్తుంది.