TG: ఆదిలాబాద్ జైలు నుంచి విడుదలైన అనంతరం మాజీ MLA బాల్క సుమన్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. తనను అక్రమంగా జైల్లో పెట్టి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడ్డారని, దీని ద్వారా కొందరు రాక్షసానందం పొందారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా చివరికి న్యాయమే గెలిచిందని ఆయన పేర్కొన్నారు. చెన్నూర్ MLA వివేక్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.