WGL: నర్సంపేట పట్టణంలో సబ్ డివిజన్ కార్యాలయం నిర్మాణానికి ఇవాళ సాయంత్రం భూమి పూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వంశీ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరుకానున్నారని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.