SRD: అమీన్పూర్ పట్టణ ప్రాంతానికి చెందిన ప్రముఖ కూచిపూడి క్లాసికల్ డాన్సర్ వడ్ల నివేదిత CCRT స్కాలర్షిప్కు ఎంపికైంది. దేశం మొత్తంలో 640 మంది సెలెక్ట్ అయ్యారు. ఇందులో 10 మంది కూచిపూడి డాన్సర్లలో 14 ఏళ్ల వడ్ల నివేదిత ఉన్నారు. ఇప్పటికీ ఈమె 210కి పైగా కూచిపూడి నృత్య ప్రదర్శనలుచేసింది. ఇప్పుడు CCRT స్కాలర్షిప్ అవార్డు దక్కడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.