SKLM: సంతబొమ్మాళి జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న డౌన్ సిండ్రోమ్ దివ్యాంగురాలు సుగ్గు పావని(మూలపేట)కి తెలంగాణకు చెందిన ఓ ప్రైవేటు స్వచ్ఛంద సంస్థ రూ. 10 వేల ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ మొత్తాన్ని మండల విద్యాశాఖ అధికారి జె. చిన్నవాడు గురువారం పాఠశాల వద్ద ఆమెకు అందజేశారు. ఈ నిధులను అవసరాల కోసం వినియోగించుకోవాలని ఆయన సూచించారు.