AP: పులివెందులలో ఉన్నా పెద్దదస్తగిరి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని జగన్ను ఎమ్మెల్సీ భూమిరెడ్డి ప్రశ్నించారు. ఈ మృతిని గంజాయి బ్యాచ్ పనిగా, అనుమానాస్పద మృతిగా మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పెద్దదస్తగిరి పేరుతో వందల కోట్ల భూదందాలు, బినామీ ఆస్తులు ఉన్నాయని, అసలు ఫ్యాక్టరీలు లేని రవీంద్రనాథ్ రెడ్డికి ఇన్ని కోట్లు ఎక్కడివని నిలదీశారు.