JN: లింగాల గణపురం మండలం వడిచర్ల, నేలపోగుల, అప్పిరెడ్డిపల్లి గ్రామాల్లో మంగళవారం ఢిల్లీపై దండోరా గోడపత్రికలను కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో ముద్రణ సాధన సమితి ప్రతినిధులు, డప్పు కళాకారులు ఆవిష్కరించారు. కరెన్సీపై అంబేడ్కర్ ఫోటోను ముద్రించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12న ఢిల్లీలో దండోరా చేపట్టనున్నట్లు తెలిపారు.