చెట్లను గొడ్డలితో నరికినా మళ్లీ చిగురిస్తాయి. ఆయుధాలతో శరీరానికి తగిలిన గాయాలైనా మానుతాయి. కానీ, కఠినమైన మాటలతో మనస్సుపై చేసిన గాయం ఎప్పటికీ మానదని విదురుడు ధృతరాష్ట్రునికి చెప్పారు. శారీరక గాయాల కంటే మానసిక గాయాలు చాలా లోతైనవి. ఆ మాటలు జీవితాంతం బాధిస్తాయి కాబట్టి, ఇతరులతో మాట్లాడేటప్పుడు పదాలను చాలా జాగ్రత్తగా, ఆచితూచి వాడాలని విదుర నీతి సారాంశం.