NRPT: మరికల్ మండల కేంద్రంలోని జల లింగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి కోసం భక్తులు శుక్రవారం రూ.50 వేలు వితరణ చేశారు. ఈ నగదును పట్టణ వీర సేవా సంఘం అధ్యక్షుడు శివప్రసాద్కు అందజేశారు. దాతల సహకారంతో ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు వీరభద్రప్ప, ప్రకాష్, బుచ్చప్ప తదితరులు పాల్గొని తమ ఉదారతను చాటుకున్నారు.