E.G: రాజమండ్రిలోని స్థానిక 23వ వార్డులో శ్రీ వజ్ర గణపతి ఆలయంలో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. పేరూరి మహేంద్రనాధ్, వెంకటరమణ దంపతులు కళ్యాణం జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కళ్యాణాన్ని తిలకించి పులకించారు. స్వామివారికి ఏకాదశ హారతులు ఇచ్చిన అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.