KKD: శంఖవరం మండలం అన్నవరంలో కొలువై ఉన్న వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి నిత్య అన్నదానం పథకానికి అన్నవరం గ్రామ వాస్తవ్యులు కర్రీ సత్య గౌరీ ఉదయ్ శర్మ స్వామి వారికి రూ.1,00,000 రూపాయలు విరాళంగా సమర్పించారు. ముందుగా దాతలు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దాతలకు ఆలయ సిబ్బంది స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.