TG: హైదరాబాద్ బాచుపల్లి పీఎస్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రగతినగర్ దగ్గర ఫర్నిచర్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాపు నుంచి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. షార్ట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.